By: Oneindia Telugu Video Team
Published : May 23, 2017, 03:17

కోహ్లీకి ఎసరు కెప్టెన్ గా రోహిత్ శర్మా..?

Subscribe to Oneindia Telugu

ఐపీఎల్ పదో సీజన్ ముగిసింది. 47 రోజులు పాటు రసవత్తరంగా సాగిన ఈ టోర్నీలో విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. అయితే ఐపీఎల్ పదో సీజన్‌లో పూణెపై ముంబై పైనల్‌లో నెగ్గిన విజయాన్ని చూసిన క్రమంలో తెరపైకి కొత్త వాదన వచ్చింది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా రాబోయే కాలంలో రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించే అవకాశాలపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి.ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మెట్లలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు పదో సీజన్‌లో చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. అంతేకాదు ఈ సీజన్‌లో బెంగళూరు ఓ చెత్త రికార్డుని కూడా సొంతం చేసుకుంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 9.4 ఓవర్లలో 49 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ పరుగులకే అవుటైన జట్టుగా నిలిచింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా