By: Oneindia Telugu Video Team
Published : December 13, 2017, 06:27

మూడో డబుల్ సెంచరీ తో రోహిత్ రికార్డు లు

Subscribe to Oneindia Telugu

మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 151 బంతుల్లోనే 13 ఫోర్లు, 12 సిక్సర్లతో వన్డేల్లో డబుల్ సెంచరీ చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది మూడో డబుల్ సెంచరీ కావడం విశేషం. అయితే ఈ అరుదైన రికార్డు సాధించిన రోహిత్ మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులుకొట్టిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. గతంలో 40 సిక్సులతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డును 41 సిక్సులతో రోహిత్ బద్దలుకొట్టాడు.
ఇక ఈ రోజు చేసిన సెంచరీతో రోహిత్ వన్డేల్లో ఒక ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. ఇక వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరంచిన రోహిత్ తన రెండో వన్డేలోనే డబుల్ సెంచరీ నమోదు చేసి మరో రికార్డును సాధించాడు. ఇక వన్డేల్లో భారత జట్టు కెప్టెన్‌ గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఇన్ని రికార్డులు సాదించిన రోహిత్ శర్మ కు ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు తమ శుబాకాంక్షలు తెలిపారు. క్రికెట్ అభిమానులు సోషల్‌మీడియాలో ప్రశంసిస్తూ ట్వీట్‌లు, పోస్టులు చేస్తున్నారు. అలాగే రోహిత్ పై ప్రసంసల జల్లు కురిపించారు. క్రికెట్ దిగ్గజాలు చేసిన tweets లో కొన్ని tweets మీకోసం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా