• search
By : Oneindia Telugu Video Team
Published : April 12, 2018, 09:30
Duration : 02:05

హోదా అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఆనంద నగరాలు : రోజా

ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలోని బీజేపీతో తాము కుమ్మక్కైతే తమ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఎందుకు ఆమరణ దీక్ష చేస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీలను విమర్శించే అర్హత టీడీపీకి లేదని అన్నారు. రోజా మీడియాతో మాట్లాడుతూ..
ఏ ముఖ్యమంత్రి పాలననైనా ప్రజలు పొగుడుతారు కానీ చంద్రబాబు మాత్రం తనను తానే పొగుడుకుంటారని రోజా ఎద్దేవా చేశారు. ప్రజలంతా బాధల్లో ఉంటే ఈయనేమో ఆనందనగరి అని వేడుకలు చేస్తారా? అని మండిపడ్డారు. చంద్రబాబు అన్నట్లు ప్రజలంతా సంతోషంగా ఉంటే వెంటనే ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి..ఎన్నికలకు వెళదామని, ఇందుకు టీడీపీ సిద్ధమేనా? అని రోజా సవాల్ విసిరారు.
హోదా కోసం ఆందోళనలు చేస్తోన్న వైసీపీ కార్యకర్తలను పోలీసులతో అడ్డగించడం సిగ్గుచేటుకాదా? మీరు 30 సార్లు ఢిల్లీకి వెళ్లింది ఓటుకు నోటు కేసు, నియోజకవర్గాల పెంపు కోసం కాదా?' రోజా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారమే పరమావధి తప్ప, మరో ఆలోచన లేదని అన్నారు. రాజధానిలో నాలుగేళ్లలో కనీసం నాలుగు అంతస్తుల భవనం కూడా కట్టలేని తెలుగు దేశం ప్రభుత్వం అక్రమార్జనలో మాత్రం ఆకాశాన్ని దాటిపోయిందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. భూములు కోల్పోయిన రైతుల కన్నీళ్లతో అమరావతిని స్యాడ్ కాపిటల్ మార్చారని చంద్రబాబుపై మండిపడ్డారు.
టీడీపీ ప్రభుత్వం హయాంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని రోజా ఆరోపించారు. చంద్రబాబు ఏప్రిల్ 30న తిరుపతిలో సభ పెట్టి కేంద్రాన్ని నిలదీస్తామంటూ కొత్త నాటకానికి తెరతీస్తున్నారని రోజా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తానన్న పవన్.. ఇటీవల ప్రత్యేక హోదా కోసం 2కి.మీల పాదయాత్ర చేయడం అభినందనీయమని అన్నారు. ఈ పోరాటాన్ని ఆయన కొనసాగిస్తే మంచిదని రోజా వ్యాఖ్యానించారు. కీలక పదవుల్లో ఉండికూడా వెంకయ్య నాయుడు ప్రధానిని ఏపీకి ప్రత్యేక హోదా గురించి అడగరని, అలాగే సీఎం చంద్రబాబు.. వెంకయ్యను హోదా గురించి అడగరని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి