By: Oneindia Telugu Video Team
Published : August 30, 2017, 05:42

జగన్ అంటే ఏంటో! ఫేస్‌బుక్‌లో రోజా పెట్టిన పోస్ట్ ఇదే...

Subscribe to Oneindia Telugu


గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా ఆఖరి శ్వాసవరకూ జై జగన్ అంటూనే ఉంటానని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ వ్యాఖ్యలను పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి పరాజయం నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నంద్యాల ఫలితం వెలువడ్డాక రోజాపై సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల ప్రచారం సాగింది. వీటికి సమాధానంగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అదే సమయంలో జగన్ పైన వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫేస్‌బుక్‌లో రోజా పెట్టిన పోస్ట్ ఇదే...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా