క్రికెట్ అకాడమీ స్థాపించిన సచిన్

Published : July 19, 2018 04:00 PM (IST)
Sachin Tendulkar Launches Cricket Academy
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ త్వరలో క్రికెట్ అకాడమీని ప్రారంభించబోతున్నాడు. మిడిలెసెక్స్‌ క్రికెట్‌తో కలిసి 'టెండూల్కర్ మిడిలెసెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ (టీఎంజీఏ)'ను ప్రారంభించబోతున్నట్లు సచిన్‌ బుధవారం తెలిపాడు. ఇద్దరి సంయుక్త భాగస్వామ్యంలో రూపొందనున్న ఈ అకాడమీకి టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ క్రికెట్ అకాడమీ (టీఎమ్‌జీఏ)గా నామకరణం చేశారు.ఈ అకాడమీ ద్వారా 9 నుంచి 14 ఏళ్ల వయస్సులోపు బాలబాలికలకు సచినే స్వయంగా శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమాలను మొదటి క్రికెట్‌ క్యాంపులో భాగంగా వచ్చే నెల 6 నుంచి లండన్‌లోని నార్త్‌వుడ్‌లో ఉన్న మర్చంట్‌ టేలర్స్‌ స్కూల్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత లండన్, ముంబైలకు కూడా దీనిని విస్తరించనున్నారు. మిడిలెసెక్స్‌లోని ప్రొఫెషనల్ కోచ్‌లు పూర్తిస్థాయి సమగ్ర శిక్షణ కరికులమ్‌ను రూపొందించారు.క్రికెట్‌కు సంబంధించి చాలా అంశాల్లో మాస్టరే నేరుగా శిక్షణ ఇవ్వనున్నాడు. అథ్లెట్‌గాఎదుగడం, క్రీడా సైకాలజీ, వ్యూహాలు రూపొందించడం, సాంకేతిక అంశాలపై ఇందులో శిక్షణ ఉంటుంది. 'నైపుణ్యాన్ని వెతికి పట్టుకునే అంశాలను మా అకాడమీ చూసుకుంటుంది. అనాథ పిల్లల కోసం 100 స్కాలర్‌షిప్‌లు కూడా కేటాయించాం' అని టీఎమ్‌జీఏ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
Up Next
Recommended వీడియోలు
  • 13 hours ago
    జగన్, వైఎస్సార్‍కు తేడా అదే..!
  • 18 hours ago
    మ్యాక్స్ వెల్ ని పక్కన పెట్టేసారు.. కారణం ఇదేనా..?
  • 20 hours ago
    ఇక కవిత పరిస్థితి..??
  • 20 hours ago
    సచిన్
  • 20 hours ago
    వర్షాలు ఏమో కానీ..
  • 21 hours ago
    రాహుల్ గాంధీది రాజా పుట్టుక.. అందుకే ..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా