By : Oneindia Telugu Video Team
Published : September 14, 2017, 03:45

ధోని ఫ్యాన్స్‌కు కోపం తెప్పించిన సాహా భార్య కోరిక

భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా భార్య కోరిక.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిమానులకి కోపం తెప్పించింది. బెంగాల్‌కు చెందిన వృద్ధిమాన్ సాహా కోల్‌కతాలో ఓ మ్యూజిక్ సీడీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా సాహా మీడియాతో మాట్లాడుతూ 2019 వరల్డ్ కప్‌ జట్టులో చోటు సంపాదించమని తన భార్య రోమీ నిత్యం తనను ప్రోత్సహిస్తూ ఉంటుందని చెప్పాడు. 'నా భార్య ఒక కోరిక కోరింది. రాబోయే వరల్డ్ కప్‌లో టీమిండియా తరఫున నన్ను ఆడాలని కోరింది' అని వెల్లడించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా