By : Oneindia Telugu Video Team
Published : April 06, 2018, 01:11

సల్మాన్ ఖాన్ శిక్షపై పాకిస్తాన్ మంత్రి సంచలన వ్యాఖ్య

కృష్ణజింకలను వేటాడిన కేసులో అయిదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా పడిన నటుడు సల్మాన్ ఖాన్ అంశంపై పాకిస్తాన్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్పందించారు. ఆయన ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. సల్మాన్ ఖాన్ ముస్లీం మైనార్టీ అయినందునే జైలు శిక్ష వేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
భారత్‌లో ముస్లీంలను అంటరానివారిగా చేస్తారని నిందించారు. భారత్‌లోని అధికార పార్టీ ఏ మతానికి చెందినదో సల్మాన్ ఖాన్ అదే మతస్తుడు అయి ఉంటే ఇంత తీవ్రమైన శిక్ష పడి ఉండేది కాదన్నారు. కోర్టు కూడా తక్కువ శిక్ష విధించేది అన్నారు.
సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్ జైలుకు తరలించారు. సల్మాన్‌ను సాధారణ ఖైదీలానే పరిగణిస్తామని అధికారులు చెప్పారు. ఖైదీ నెంబర్ 106ను కేటాయించారు. అతని బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు తీర్పు వచ్చే అవకాశముంది. బెయిలు వస్తుందన్న ఆశతో సల్మాన్ తొలి రాత్రి గడిపాడు. జైలులో అతడికి ఓ చెక్క మంచం, నాలుగు దుప్పట్లను అధికారులు అందించారు. రాత్రి ఆయన ఆ మంచం పైనే నిద్రించినట్టు అధికారులు తెలిపారు. జైలుకు చేరుకున్న సల్మాన్‌కు ఆయన మేనేజర్ హోటల్ తాజ్ నుంచి ఆహారం, దుస్తులు తెచ్చి ఇచ్చినట్టు వచ్చిన వార్తలను జైలు అధికారులు కొట్టి పారేశారు.అతడు వాటిని తెచ్చిన మాట వాస్తవమే అయినా దుస్తులు మాత్రమే తీసుకుని తినుబండారాలను వెనక్కి పంపించినట్లు తెలిపారు.జైలులో సల్మాన్‌కు ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించలేదన్నారు. జైలుకు వచ్చినప్పుడు అతడికి రక్తపోటు ఉందని, ప్రస్తుతం అది సాధారణ స్థాయికి చేరుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి సల్మాన్ నీళ్లు తప్ప ఏమీ తీసుకోవడం లేదన్నారు. జైలు మెనూ ప్రకారం రాత్రికి భోజనంలోకి చనా పప్పు, క్యాబేజీ అందించినట్టు చెప్పారు. ఈ ఉదయం అందరితో పాటు బ్రేక్‌ఫాస్ట్, టీ, తర్వాత కిచిడీ ఇస్తామన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా