By: Oneindia Telugu Video Team
Published : November 27, 2017, 10:52

ఇవాంకాకు సమంత చీర

Subscribe to Oneindia Telugu

అమెరికా అధ్యక్షుడు డోనాల్ద్ ట్రంప్ కూతురు ఇవాంకకు తెలంగాణ చేనేత కార్మికుల ప్రతిభ తెలిసి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు వస్తున్న ఇవాంకకు సిద్దిపేట కానుక అందనుంది. సిద్దిపేటలో ప్రత్యేకంగా తయారయ్యే అందమైన గొల్లభామ చేనేత చీరలు ఇవాంకకు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం ఆమెకు అందించే కానుకల జాబితాలో గొల్లభామ చీర చేర్చనున్నట్లు తెలుస్తోంది.
సిద్దిపేట ప్రాంతంలో 50ఏళ్ల నుంచి వాటిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. పేటెంట్‌ హక్కులు కూడా సిద్దిపేటకు దక్కాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ చీరల తయారీని ప్రోత్సహిస్తున్నారు. వీటిని ప్రాచుర్యంలో తేవడానికి కృషి చేస్తున్నారు.
తెలంగాణ చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ సినీనటి సమంత కూడా ఈ చీరల తయారీని ప్రోత్సహిస్తున్న విషయం తెసిందే. వీటికి మరింత గుర్తింపు తెచ్చేందుకు ఆమె స్వయంగా ఇక్కడకు వచ్చి సూచనలు ఇస్తున్నారు. కొన్ని డిజైన్లను కూడా సమంత ఎంపిక చేశారు. ఇందులో నుంచే ఇవాంకకు గొల్లభామ చీర అందజేయడంతో పాటు అక్కడికి వచ్చే మహిళలకు ధరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. నూలు, సహజ రంగులను సరఫరా చేయిస్తూ గొల్లభామ చీరలను సమంత నేయిస్తూ వచ్చారు.సమంత సూచనల మేరకు ఇప్పుడు గొల్లభామ చీరలు తయారై ఎగుమతులు కూడా మొదలయ్యాయి. నేతలో భాగంగా అంచులు, చీరల మధ్యలో అక్కడక్కడా గొల్లభామలు నేయడం ఇక్కడి చేనేత కార్మికుల ప్రత్యేకత. ఈ చీర నేయాలంటే ప్రత్యేకమైన మగ్గాలు అవసరం. నేసేందుకు నాలుగు రోజులు పడుతుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా