By : Oneindia Telugu Video Team
Published : November 06, 2019, 06:51
Duration : 01:27
01:27
ఇసుకవిధానంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఇసుక మాఫియా, స్మగ్లింగ్ నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇసుక విధానంపై సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక ధరలకు కళ్లెం వేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అంతేకాకుండా ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాలు, నియోజకవర్గాల వారిగా ధలను నిర్ణయించాలని కలెక్టర్లు, గనుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పోలీసు, గనుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు