By: Oneindia Telugu Video Team
Published : January 12, 2018, 01:01

Sankranti 2018 : సంక్రాంతి పండుగ విశిష్టత, భోగి ప్రాదాన్యత, కనుమ సరదాలు !

Subscribe to Oneindia Telugu

ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ఇక ఈ వీడియో లో కొంతమంది అమ్మాయిలు సంక్రాంతి పండుగ విశిష్టత, భోగి ప్రాదాన్యత, కనుమ సరదాలు గురించి ఎంతో చక్కగా చెప్పారు.
ముగ్గులు, రధం ముగ్గు, గొబ్బెమ్మలు, భోగిమంట, భోగిపళ్ళు, సంకురుమయ / సంక్రాంతి పురుషుడు, గంగిరెద్దు, హరిదాసు, తిల తర్పణం, గాలిపటాలు, కోళ్ళ పందాలు సంక్రాంతి ప్రతేకతలు. హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో సినీ నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి సమయంలోనే విడుదల చేయటం శుభప్రదంగా భావిస్తారు. గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని అని చెప్పే దానికి సంకేతం. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా