By : Oneindia Telugu Video Team
Published : January 13, 2018, 04:48

కోడి పందాలు ఉన్నట్టా ? లేనట్టా ?

కోడిపందెం అనేది ప్రతీ యేటా సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహిస్తుంటారు. కోడి పందాల కు ఉన్న క్రేజే వేరు. అయితే సంక్రాంతి పర్వదినం సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ల పందేల జోరు మాములుగా ఉండదు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పెందేల జోరు జూదరుల పాలిట స్వర్గంగా మారింది. పోలీసు ప్రకటనలు తేలిపోయి, మరోసారి పందెగాళ్లదే పైచేయి అయ్యేలా ఉంది. సంప్రదాయం పేరుతో నిర్వహించే కోడిపందాలు ఈసారి మరింత జోరుగా సాగుతాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియా లో కోడి పందాలు జరిగాయని తెలుస్తున్నది.కోడిపందాలపై హైకోర్టు తీర్పు పందెం రాయుళ్లకు షాకిచ్చింది. అంతేకాదు కోడి పందాల నిర్వహణ విషయంలో ఎపి ప్రభుత్వం తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా గత ఏడాది కోడిపందాల ను నిరోధించడంలో విఫలమైనందుకు అత్యున్నత స్థాయి అధికారులకు సైతం నోటీసులు జారీచెయ్యడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్టి పరిస్థితుల్లోను ఈ ఏడాదైనా సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా