By : Oneindia Telugu Video Team
Published : January 12, 2018, 12:46

సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి రాగానే పెద్ద పండుగ వచ్చేసింది అంటారు. తెలుగువాళ్ళకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి కి ఉన్న ప్రాముఖ్యతే వేరు. సంక్రాంతి పండుగ పుష్య మాసంలో వస్తుంది.ఇది మూడు రోజుల పండుగ.అందుకే దీనిని పెద్ద పండుగగా పిలుస్తారు. ఇక సంక్రాంతి కి వండే పిండివంటలు అన్నీ ఇన్ని కావు. అరిసెలు, బూంది అచ్చు. ఇంకా ఏమయినా హాట్ ఇలా చాలా రకాల పిండివంటలు వండుతారు. సంక్రాంతి కి వండే పిండివంటలు కు ఉండే ప్రత్యేకతే వేరు.
ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) ఇతర ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు.
ఇక మూడు రోజుల సంక్రాంతి లో మొదటి రోజు "భోగి":
భోగి రోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు. ముగ్గుమధ్యలో "గొబ్బెమ్మలు" పెడతారు. అమ్మాయిలు ముగ్గులు పోటీ పడి మరీ వేస్తారు. వాటిని రంగులతో అలంకరిస్తారు. వివిధ రకాల ముగ్గులతో పండుగ నెల అంతా కలకల్లాడుతుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా