• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 31, 2018, 06:21
    Duration : 01:48

    సర్పంచుల పదవీకాలంపై స్పందించని చంద్రబాబు


    రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌ల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో పంచాయతీల్లో తదుపరి పాలన ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది. సర్పంచ్‌ల పదవీకాలం పూర్తవుతున్నా పంచాయతీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయం వెలువడక పోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో 12,850 చోట్ల సర్పంచ్‌ల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగియనుంది. వీటిలో అధికారం ఎవరికి అప్పగిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ సిఎం చంద్రబాబు వద్ద దాదాపు నెల రోజులుగా పెండింగ్‌లో ఉందని అధికారవర్గాలు అభిజ్ఞ వర్గాల భోగట్టా. దీంతో ఈ విషయమై సిఎం నిర్ణయం ఎప్పుడువెలువడుతుందా?...అనేది ఆసక్తికరంగా మారింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా