By : Oneindia Telugu Video Team
Published : February 09, 2017, 02:46

సెల్వం బయటపెట్టిన లేఖ

అమ్మ ఆలోచనలు వేరు... అమ్మ ఆదేశాలు వేరు... అమ్మ నిర్ణయాలు వేరు.... తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. అందరి నుంచి ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా పన్నీర్‌ సెల్వం నోరు విప్పడంతో... శశికళ గుట్టు మొత్తం రట్టవుతుంది. ముఖ్యమంత్రి పదవి కోసం ఆమె ఎంతలా వెంపర్లాడుతుందో... స్పష్టంగా అర్ధమవుతుంది. ఎప్పుడైతే పన్నీర్‌ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేశారో... అప్పుడే శశికళ క్యాంపు రాజకీయాలకు కొబ్బరికాయ కొట్టేసింది. తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఓ రిసార్ట్‌లో పెట్టి తాళం వేసేసింది. ఈనేపథ్యంలోనే సెల్వం తన దగ్గర ఉన్న ఒక్కో ఆయుధాన్ని వదలడం మొదలుపెట్టారు. జయలలిత బతికి ఉన్న సమయంలో... శశికళకు ఆమె ఎలాంటి గుర్తింపు నిచ్చారో... రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంచారో... ప్రజలకు అర్ధమయ్యేలా చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా