By: Oneindia Telugu Video Team
Published : February 09, 2017, 11:02

తమిళనాడులో ఏం జరుగుతుంది..?

Subscribe to Oneindia Telugu

ఊహించలేదు. తమిళ రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకుంటాయని ఎవరూ ఊహించలేదు. అన్నా డీఎంకే పార్టీ రెండుగా చీలిపోతుందని ఎవరూ ఊహించలేదు. సొంత పార్టీలోనే ధిక్కార స్వరం వినాల్సి వస్తుందని... స్వర్గస్తురాలైన జయలలిత కూడా బహుసా ఊహించి ఉండరు. అయితే ఈ కథ మొత్తం ఎప్పుడు మొదలైంది. శశికళ ఇంత డ్రామా ఎందుకు ఆడాల్సి వచ్చింది..? ఇప్పుడు అందరిలోనూ ఇవే అనుమానాలు గుప్పు మంటున్నాయి. ప్రస్తుతం తమిళనాడు అల్లకల్లోలంగా మారింది. ఈ పరిస్థితికి కారణం స్వార్ధరాజకీయాలే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉన్నట్టుండి... హఠాత్తుగా సీఎం అయిపోవాలని శశికళకు వచ్చిన ఆలోచనే ఇప్పుడు... గుట్టు మొత్తం రట్టయ్యేలా చేసింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా