By: Oneindia Telugu Video Team
Published : December 27, 2016, 11:59

మీడియా పాత్ర పోషించాలి

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో సాధారణ ప్రజలు నగదు రహిత లావాదేవీల వైపు పయనించేలా మీడియా కీలక పాత్ర పోషించాలని యస్.బి.ఐ చీఫ్ మేనేజర్ శ్రీమతి వందనాగాంధీ అన్నారు. డిజిటల్ లిటరీ క్యాంపేన్ లో భాగంగా మంగళవారం సచివాలయంలో ఆర్ధిక శాఖ ఆధ్వర్యంలో మీడియాకు కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా తమ సంస్ధల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మొబైల్ యాప్ లు, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సేవలను వివరించారు. ఈ సందర్భంగా శ్రీమతి వందనా గాంధీ మాట్లాడుతూ ప్రజలంతా డిజిటల్ లావాదేవీలను విస్తృతంగా వినియోగించాలని మొబైల్ ద్వారానే నగదు రహిత ప్రక్రియలను నిర్వహించడానికి ఎన్నో వివిధ యాప్‌లను అమలు చేస్తున్నామన్నారు. నగదు రహిత లావాదేవీలపై నిర్వహించే డిజిటల్ కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళేలా మీడియా చురుకైన పాత్ర పోషించాలని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా