భారత్ చెప్పిందే వేదం... క్రికెట్ ప్రపంచానికి మంచిది కాదు
Published : June 21, 2022, 05:30
భారత్ చెప్పిన విషయాన్ని క్రికెట్ ఆడే అన్ని దేశాలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న సమయంలో అంతర్జాతీయ టోర్నమెంట్లను కూడా వాయిదా వేసుకోవడమో, రీషెడ్యూల్ చేసుకోవడమో జరుగుతోందని, క్రికెట్‌పై భారత్ సాధించిన ఆధిపత్యానికి అది నిదర్శనమని షాహిద్ అఫ్రిదీ పేర్కొన్నారు.