By: Oneindia Telugu Video Team
Published : July 27, 2017, 11:45

గాలే లో రికార్డు సృష్టించిన శిఖర్ ధావన్

Subscribe to Oneindia Telugu

గాలే వేదికగా శ్రీలకంతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. 190 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరి డబుల్ సెంచరీ మిస్ అయిన ధావన్ టెస్టు క్రికెట్లో ఓ అద్భుతమైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
టెస్టుల్లో ధావన్‌కి ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్‌లో 168 బంతుల్లో 31 ఫోర్ల సాయంతో 190 పరుగులు చేసి డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. 55వ ఓవర్లో ప్రదీప్‌ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న ధావన్‌ (190) పరుగుల వద్ద మాథ్యూస్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.ఒక సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా