By: Oneindia Telugu Video Team
Published : January 04, 2018, 06:00

సుష్మాస్వరాజ్ కన్నడ స్పీచ్ : సుష్మాస్వరాజ్ 'కన్నడిగా' నా ?

Subscribe to Oneindia Telugu


సుష్మాస్వరాజ్ పరిచయం అక్కర్లేని పేరు ! భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేతలలో అగ్రగణ్యురాలైన సుష్మాస్వరాజ్ హర్యానా లోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. కేంద్రమంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మాస్వరాజ్ భారతదేశపు మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు అన్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి గా 100 కు 200 శాతం న్యాయం చేస్తూ
సుష్మాస్వరాజ్ భాద్యతలు నిర్వహిస్తున్నారు.
అయితే సుష్మాస్వరాజ్ హిందీ పరిజ్ఞానం గురించి మన అందరకీ తెలుసు. రాజకీయంగాను, రాజకీయేతరం గాను సుష్మాస్వరాజ్ ఎంత గొప్ప వక్తో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1970లలోనే విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమం నడిపారు.
ఇక ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి 1998 అక్టోబర్లో సుష్మాస్వరాజ్‌ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్రమంత్రిమండలి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడానికి పంపించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా సుష్మాస్వరాజ్ రికార్డు సృష్టించిననూ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరాజయం పొందుటతో డిసెంబర్లో మళ్ళీ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశీంచారు. కాగా 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున బలమైన మహిళా నాయకురాలి గా సుష్మాస్వరాజ్‌ను బరిలోకి దించారు. అయితే ఊహించినట్లుగానే సుష్మాస్వరాజ్ ఓడిపోయినా సోనియాపై పోటీచేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా