By: Oneindia Telugu Video Team
Published : January 07, 2017, 09:37

మరో శతాబ్ధం వరకు ఉత్పత్తి

Subscribe to Oneindia Telugu

సింగరేణి అభివృద్ధిలో వేలాది మంది కార్మికుల శ్రమ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. సింగరేణి బొగ్గు అంశంపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, విద్యుత్ ఉత్పాదనకు, పారిశ్రామిక ప్రగతికి మూలాధారమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. మరో శతాబ్ది కాలం వరకు ఉత్పత్తి కొనసాగించేందుకు వీలైనన్ని బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, సింగరేణి కార్మికులకు పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూర్చే నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా