By : Oneindia Telugu Video Team
Published : December 19, 2017, 01:27
01:49
చంద్రబాబూ నువ్వు కాంగ్రెస్‌తో కలిశావ్ : పవన్ కళ్యాణ్ వల్లే !
బీజేపీ నేత, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు మంగళవారం టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్ పార్టీతో జత కలిశారని తీవ్ర ఆరోపణలు చేశారు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి, ఇతరులను ప్రధానమంత్రిని చేశారని చెప్పారు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసినట్లే కదా అని అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలతో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ బాధపడినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన మీ స్థాయి ఏమిటి అని మాట్లాడటం సరికాదని విమర్శించారు.
వాజపేయి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వరకు తమ స్థాయి, తమ బలం ఏమిటో అందరికీ తెలుసునని సోము వీర్రాజు అన్నారు. పొత్తులో భాగంగా చంద్రబాబును వాజపేయి హయాంలో బాగా ఆదరించామని చెప్పారు. 2009లో చంద్రబాబు విడిగా పోటీ చేసి నెగ్గలేకపోయారని చెప్పారు. అవసరమైతే మా సత్తా చూపిస్తామని అభిప్రాయపడ్డారు.
నేను వాస్తవాలు చెప్పానని, మా పార్టీ బలోపేతం కోసం మాట్లాడుతుంటే, మీరు మమ్మల్ని అనడం ఏమిటని టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్‌పై సోము వీర్రాజు మండిపడ్డారు. మా మూలంగా తెలుగుదేశం గెలిచిందని మేం ఎప్పుడూ చెప్పలేదన్నారు.