By: Oneindia Telugu Video Team
Published : June 28, 2017, 10:13

సత్తా ఉన్నోడే టీం ఇండియా కోచ్

Subscribe to Oneindia Telugu

మ్యాచ్‌లను గెలిపించగలిగే సత్తా ఉన్నవాడినే కోచ్‌గా ఎంపిక చేస్తామని క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరభ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామాతో ఇప్పుడు టీమిండియా కొత్త కోచ్ ఎవరన్న దానిపై స‌స్పెన్స్ కొనసాగుతూనే ఉంది. వచ్చే నెలలో భారత జట్టు శ్రీలంక పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ లోపు కోచ్ ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీసీసీఐ మళ్లీ కోచ్ పదవి కోసం దర‌ఖాస్తుల‌ను కూడా ఆహ్వానించింది. కోచ్ ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్న సీఏసీలో స‌భ్యుడిగా ఉన్న గంగూలీ ఈ విషయంపై తొలిసారి స్పందించాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా