By : Oneindia Telugu Video Team
Published : June 19, 2018, 11:39
Duration : 01:40
01:40
రుతుపవనాలు ఆలస్యం..వేడెక్కనున్న రాష్ట్రం
సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ మహారాష్ట్రను దాటి ఉత్తరాది వైపు కదిలాయి. పెనిన్సులార్ ఇండియా కాకుండా మిగతా ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో ఈ రుతుపవనాల ప్రభావం ఆలస్యం అయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వెస్టర్న్ హిమాలయాల ప్రాంతం, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, వెస్ట్ ఉత్తర ప్రదేశ్లలో రానున్న 24 గంటల్లో భారీ ఉరుములు, బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
నార్తర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్స్ థానే, ముంబై, అహ్మద్ నగర్, బుల్దానా, అమరావతి, గోండియా, తిత్లాఘర్, కటక్, మిడ్నాపూర్ ప్రాంతాల మీదుగా కదులుతున్నాయి. నైరుతీ రుతుపవనాలు రానున్న 5-6 రోజుల్లో బలహీనపడే అవకాశముంది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు ఈ సీజన్లో సెంట్రల్ ఇండియాలో సాధారణ వర్షపాతం, దక్షిణాది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురవనుంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దేశవ్యాప్తంగా వర్షపాతం 101 శాతం ఉటుందని తెలిపింది.
ఏపీలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాస రావు వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు సెలవులు ఉంటాయని, 22న పాఠశాలలు యథావిథిగా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సెలవుల్లో ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు