By: Oneindia Telugu Video Team
Published : October 31, 2017, 02:58

అక్టోబర్ నెల భారత క్రీడలకు పండుగ తీసుకొచ్చింది

Subscribe to Oneindia Telugu

అక్టోబర్ మాసం.. భారత క్రీడా రంగానికి అన్ని విధాలా కలిసొచ్చింది. దసరా, దీపావళి లాంటి పండుగల పర్వదినాలను మోసుకురావడంతో పాటు భారత క్రీడాకారులు ఈ నెలలో అద్భుత ప్రదర్శనతో చెరగని ముద్ర వేశారు. అక్టోబర్ నెలలో ప్రాతినిథ్యం వహించిన ప్రతి ఈవెంట్లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. భారత అభిమానులు ఎంతగానో ఆదరించే క్రికెట్ నుంచి మొదలు పెడితే హాకీ, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, షూటింగ్‌, ఆర్చరీ ఇలా అన్ని పోటీల్లో భారత్ సత్తా చాటింది.
క్రికెట్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత, బ్యాడ్మింటన్ తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ వరుసగా నాలుగు సూపర్ సిరిస్ విజయాలు, ఆసియా హాకీ టోర్నీలో పదేళ్ల నిరీక్షణకు తెర, ఫిఫా అండర్17 వరల్డ్ కప్‌కు భారత్ తొలిసారి ప్రాతినిథ్యం, ప్రో కబడ్డీలో పట్నా మూడోసారి విజయం, ఆర్చరీలో రికార్డు రజతం, వరల్డ్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో పసిడి... ఇలా భారత్ క్రీడాకారులు అద్భుత విజయాలు సాధించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా