By : Oneindia Telugu Video Team
Published : November 07, 2017, 11:49

ధోని, ద్రవిడ్‌ అలా చేస్తారనుకోలేదు !

తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జట్టులో సహచర ఆటగాళ్లుగా ఉన్న మహేంద్ర సింగ్ ధోని, రాహుల్‌ ద్రవిడ్‌ తనకు అండగా నిలబడలేదని టీమిండియా మాజీ పేసర్‌ శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో శ్రీశాంత్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఐపీఎల్‌-2013 స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రాజస్ధాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ప్రాంఛైజీకి అండగా ఉన్నారే తప్ప తనకు మద్దతు ఇవ్వలేదని వాపోయాడు.
ఇక, ధోనికి తాను భావోద్వేగంతో ఓ మెసేజ్‌ను పంపానని దానికి అతడు స్పందించలేదని పేర్కొన్నాడు. 'రాహుల్‌ ద్రవిడ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ వైపు నిలిచారు. నా గురించి అన్నీ బాగా తెలిసుండీ మద్దతు ఇవ్వకపోవడంతో చాలా బాధపడ్డా. ధోనికి భావోద్వేగంతో ఓ మెసేజ్ పంపించా. దానికి ధోని కనీసం స్పందించలేదు' అని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా