By: Oneindia Telugu Video Team
Published : July 21, 2017, 01:12

2011 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో శ్రీలంక కావాలనే ఓడిందా?

Subscribe to Oneindia Telugu

2011 వరల్డ్ కప్ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చేసిన వ్యాఖ్యాలకు శ్రీలంక క్రీడాశాఖ మంత్రి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్ విచారణకు తాను కూడా మద్దతు తెలుపుతున్నట్లు మంత్రి దయాసిరి జయశేఖర అన్నారు.
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన భారత్‌తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ తర్వాత 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.ఈ మ్యాచ్ త‌ర్వాత అప్ప‌టి లంక కెప్టెన్ సంగ‌క్క‌ర వెంట‌నే త‌న కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే ఫైనల్లో శ్రీలంక కావాలనే ఓడిందని, దీనిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని అప్ప‌టి నుంచీ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున ర‌ణ‌తుంగ కూడా ఆ మ్యాచ్ ఫిక్స్ అయింద‌ని ఆరోపించాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా