By: Oneindia Telugu Video Team
Published : July 25, 2017, 11:43

లంక టెస్ట్ కు kl రాహుల్ దూరమే ...?

Subscribe to Oneindia Telugu

శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియాకి తొలి టెస్టుకి ముందే వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా రెగ్యులర్ టెస్టు ఓపెనర్ మురళీ విజయ్ జట్టుకి దూరమవగా, తాజాగా జ్వరం కారణంగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.
ఇటీవల ముగిసిన వార్మప్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన కేఎల్ రాహుల్ వ్ర జ్వరం కారణంగా జట్టుతో కలిసి గాలేకి వెళ్లకుండా కొలంబోలోనే ఉండిపోయాట. గాలే స్టేడియం వేదికగా తొలి టెస్టు బుధవారం నుంచి ఆరంభం కానుంది. అనంతరం ఆగస్టు 3 నుంచి కొలంబో వేదికగా రెండో టెస్టు జరగనుంది.జ్వరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సోమవారం ప్రాక్టీస్ సెషన్‌ను కూడా కేఎల్ రాహుల్ దూరమయ్యాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా