By : Oneindia Telugu Video Team
Published : February 28, 2018, 12:40

శ్రీదేవి ఆఖరి చూపు కోసం తరలి వచ్చిన తారలు

శ్రీదేవి అంత్యక్రియలు: చివరి చూపు కోసం తరలి వచ్చిన సినీ నటులు, అభిమానులు
శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైలోని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్‌కు తరలించారు. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని దుబాయ్ నుంచి ముంబైకి తీసుకు వచ్చారు. మొదటలోఖండ్‌వాలాలోని శ్రీదేవి నివాసానికి తరలించారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌కు తరలించారు. తమ అభిమాన నటిని ఆఖరుసారిగా కళ్లారా చూసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా