By: Oneindia Telugu Video Team
Published : January 25, 2017, 12:13

యువతిని వేధించిన రిజర్వ్ ఎస్సై అరెస్టు

Subscribe to Oneindia Telugu

యువతిని వేధించిన రిజర్వ్ ఎస్సైని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోన ఓ ఎస్టేట్‌లో నివాసం ఉంటున్న యువతి, దాబా గార్డెన్స్‌లో పని చేస్తోంది. ఈమె స్నేహితురాలు ఆచూకి వారం రోజులుగా తెలియరాలేదు. ఈ కేసుకు సంబంధించి ఎస్సై ఈమెను బెదిరిస్తున్నారు. బుధవారం రాత్రి ఫోన్ చేసి.. మీ స్నేహితురాలు చనిపోయిందని, ఇందులో నీ ప్రమేయం ఉంది కాబట్టి నీపై హత్యా కేసు పెడతామని బెదిరించారు. ఆమెను అడ్రస్ చెప్పమన్నాడు. అడ్రస్ చెప్పిన తర్వాత అతను ఆమె వద్దకు వెళ్లి వేధించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా