ఓయ్ సూర్య, గాంధీ జయంతి రోజు, ఇంత విధ్వంసమా?
Published : October 03, 2022, 12:40
టీమిండియా మాజీ ఓపెనర్, దేశవాళీ దిగ్గజం వసీం జాఫర్.. సోషల్ మీడియా వేదికగా ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను చేసే ట్వీట్లే ఈ విషయాన్ని తెలియజేస్తాయి. తనదైన సెటైరికల్ ట్వీట్లతో నవ్వులు పూయించే వసీం జాఫర్.. అదే రితీలో విమర్శకుల నోళ్లు మూయిస్తాడు. ముఖ్యంగా భారత్‌పై నోరు పారేసుకునే ఆటగాళ్లకు తనదైన శైలిలో పంచ్ ఇస్తాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్తో అతనికి సోషల్ మీడియా వేదికగా ఎప్పటికీ మాటల యుద్దం నడుస్తూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూనే ఉంటారు.