By: Oneindia Telugu Video Team
Published : November 22, 2017, 12:41

కమర్షియల్ పైలెట్‌ లైసెన్స్ పొందిన ముస్లిం యువతి

Subscribe to Oneindia Telugu

కృషి, పట్టుదలతో పేదింటి ముస్లి యువతి తన లక్ష్యాన్ని సాధించింది. అనేక సమస్యలు అడ్డొచ్చినా కానీ, ఆ యువతి తన లక్ష్యాన్ని చేరుకొంది. కమర్షియల్ పైలెట్‌ లైసెన్స్ పొందిన నాలుగో ముస్లిం యువతిగా చరిత్ర సృష్టించింది. హైద్రాబాద్‌కు చెందిన సల్వా ఫాతిమా కమర్షియల్ పైలెట్‌ లైసెన్స్ పొంది ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, తమ లక్ష్య సాధనకు కృషి చేసి విజయం సాధించిన వారు అరుదుగా కన్పిస్తున్నారు.తమ లక్ష్యాల సాధనలో ఎదురైన అడ్డంకులను అధిగమిస్తేనే తుది లక్ష్యానికి చేరుకొంటారు.
కడు పేద కుటుంబంలో జన్మించిన సల్వా ఫాతిమా పైలెట్ కావాలనే తన కోరికను నెరవేర్చుకొంది.టీవీల్లో పైలెట్స్‌,ను చూసినప్పుడు పైలెట్ కావాలనే కోరిక పుట్టిందని సల్వా ఫాతిమా చెప్పారు. సల్వా ఫాతిమా తండ్రి అహ్మద్ బేకరీలో పనిచేసేవారు. ఆయనకు అతి తక్కువ వేతనం వచ్చేది. పిల్లల కడుపు నింపడమే కష్టంగా ఉండేది. అయితే పైలట్‌కు సంబంధించి పేపర్‌లో ఎలాంటి కథనాలు వచ్చినా చదివేదాన్నని సల్వా ఫాతిమా చెప్పారు..
2007లో సల్వా ఫాతిమా పైలట్‌ శిక్షణలో చేరారు. 2013లో పైలెట్ శిక్షణను పూర్తి చేసుకొన్నారు.. 2016లో మల్టీ ఇంజిన్‌ టైప్‌ రేటింగ్‌ పూర్తి చేసింది. 2016 చివర్లో ఎయిర్‌బస్‌ 320 టైప్‌ రేటింగ్‌ పూర్తి చేసి కమర్షియల్‌ పైలట్‌గా లైసెన్స్‌ సాధించింది. అంతర్జాతీయ ఏవియేషన్‌ షోలో అద్భుతమైన విన్యాసాలు చేసి సల్వా ఫాతిమా అందరినీ అబ్బురపరిచింది. ఆమె ప్రతిభను చూసి అంతర్జాతీయ పైలట్లు మెచ్చుకున్నారు. నా జీవితాశయం సాధించేందుకు ఎన్నో సవాళ్లను అధిగమించాను. ఒక పేదింటి పైలట్‌గా ఎదగడం మామూలు విషయం కాదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అసమానతలు ఎదుర్కొన్నానని సల్వా ఫాతిమా చెప్పారు. హిజాబ్‌ (తలపై ధరించే వస్త్రం) కారణంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. విదేశాల్లో శిక్షణ తీసుకున్న సమయంలోనూ నేను ధరించాను. ఎవరూ అడ్డంకి చెప్పలేదు. హిజాబ్‌ వృత్తికి అడ్డు కాదన్నారామె.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా