• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 19, 2018, 04:23
    Duration : 01:38

    రజనీ విశ్వాసఘాతకుడు.. డైరెక్టర్ భారతీ రాజా సంచలనం..!

    స్థానికేతరుడైన రజనీకాంత్ తమను పాలిస్తే స్వాగతించే స్థితిలో తాము లేమని తమిళ దర్శకుడు భారతీ రాజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బిజెపి రజనీకాంత్‌ను రంగంలోకి దింపుతోందని ఆయన ఆరోపించారు.వయస్సు అయిపోయాక రాజకీయాలంటూ వచ్చారని రజనీకాంత్, కమల్‌హసన్‌పై ఆయన విమర్శలు గుప్పించారు.
    తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్థానికేతరుడని తమిళ దర్శకులు భారతీ రాజా,సీమాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానికేతరుడైన రజనీకాంత్ తమను పాలించడాన్ని ఎలా స్వాగతిస్తామని తమను పాలించేందుకు స్థానికేతరుడిని ఎలా సమర్థిస్తామని, రజనీకాంత్ విశ్వాసఘాతుకానికి నిలువెత్తు నిదర్శనమని తమిళ దర్శకులు భారతీ రాజా, సీమాన్ విమర్శలు చేశారు. రజనీకాంత్ ‌ను అడ్డుపెట్టుకొని కొన్ని పార్టీలు ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని, ఈ రకమైన ఎత్తులు తమిళనాడులో పని చేయవన్నారు.
    నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బిజెపి రజనీకాంత్‌ను తెరమీదికి తెచ్చిందని, బిజెపి స్వతంత్రంగా పోటీ చేస్తే తమిళ ప్రజలు పట్టం కట్టరనే ఉద్దేశ్యంతో రజనీకాంత్‌ను ముందు పెట్టారని, బిజెపి వ్యూహత్మకంగా ఈ ప్రయత్నాలు చేస్తోందని వారు ఆరోపించారు.
    జయలలిత మరణించడంతో పాటు , డిఎంకె చీఫ్ కరుణానిధి అనారోగ్యం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని వారు అభిప్రాయపడ్డారు. వయస్సులో ఉండగా హిమాయాల చుట్టూ తిరిగిన రజనీకాంత్ వయస్సు అయిపోయాక రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించారని వారు ఎద్దేవా చేశారు. వయస్సు అయిపోయాక సినిమాలు ఉండవనే ఉద్దేశ్యంతో రాజకీయాలంటూ బయలు దేరారని రజనీకాంత్, కమల్ హసన్‌పై వారు విమర్శలు గుప్పించారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా