By: Oneindia Telugu Video Team
Published : August 31, 2017, 11:42

జగన్‌కు గట్టి షాక్? టీడీపీతో టచ్ లోకి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు

Subscribe to Oneindia Telugu

అనుకున్నదే అయింది.. నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేస్తుందని ఊహించినట్లుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి ఇది టీడీపీ మొదలుపెట్టిన మైండ్ గేమో.. లేక నిజంగానే ఆ పార్టీ వైపు వైసీపీ ఎమ్మెల్యేలు చూస్తున్నారో తెలియదు కానీ ఫిరాయింపు వార్తలు మాత్రం మరోసారి జోరందుకున్నాయి. వైసీపీకి చెందిన ఓ కోస్తాంధ్ర ఎమ్మెల్యేతో పాటు మరో రాయలసీమ ఎమ్మెల్యే ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మంతనాలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరు ఎప్పుడంటే అప్పుడు టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారని, సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా