By: Oneindia Telugu Video Team
Published : May 19, 2017, 11:22

APలో TDP VS BJP దూరం దూరం

Subscribe to Oneindia Telugu

రాజకీయం అంటేనే ఒక రచ్చ.. ఆ రచ్చపై జరిగే చర్చే ఇప్పుడు టీడీపీ బీజేపీల మధ్య దూరం పెరుగుతుందా అనే భావన కలిగేలా చేస్తుంది. .
చెట్టాపట్టాలేసుకుని తిరిగినంత మాత్రాన.. దోస్తులనుకుంటే పొరపాటే. మిత్రపక్షాలైనంత మాత్రాన... ఎప్పటికీ వివాదాలు రాకుండా ఉంటాయనుకోవడమూ పొరపాటే. ఇప్పుడు ఏపీలో బీజేపీ టీడీపీల పరిస్థితి చూస్తే కూడా ఇదే విషయం అర్ధమవుతుంది. వాస్తవానికి 2014 ఎన్నికల ముందు... ఈ రెండు పార్టీలు కలుస్తాయా లేదా అనే విషయంలో ఎంత టెన్షన్‌ పడ్డామో తెలియనిది కాదు. కాసేపు మద్దతుకు ఓకే అని.. కాసేపు ససేమిరా అని... బీజేపీ క్రిందిస్థాయి నేతలైతే టీడీపీతో జతకట్టేది లేదని తేల్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతటి ఉత్కంఠ భరిత వాతావరణం మధ్యలో... రెండు పార్టీలు పట్టాలెక్కేశాయి. పార్టీలైతే కలిసాయి గానీ... ఇరు పార్టీల నేతల మధ్య ఉన్న మనస్పర్ధలు మాత్రం... కలవలేకపోయాయి

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా