By: Oneindia Telugu Video Team
Published : January 24, 2017, 12:14

జగన్‌ను అరెస్టు చేయాలి

Subscribe to Oneindia Telugu

తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకు పడ్డారు. రెండు సంవత్సరాలలో అధికారంలోకి వస్తానని, ముఖ్యమంత్రి అవుతానని కాకిలా అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని, రాష్ట్రానికి పట్టిన గుడ్లగూబ అన్నారు. గుడ్లగూబ అపశకునం అని, అలాంటి జగన్ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పటిస్తే శని అన్నారు. ఆశ, దురాశ తప్ప ఏం తెలియని వైసిపి వచ్చే ఎన్నికల్లో మట్టి కొట్టుకుపోతుందన్నారు. జగన్‌ను ముందే అరెస్టు చేయాలని సీఎంను కోరుతామన్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా