By: Oneindia Telugu Video Team
Published : September 01, 2017, 03:34

30 ఏళ్ల తర్వాత టిడిపి చరిత్ర.. మేయర్ రేసులో కాపు మహిళలు వీరే!

Subscribe to Oneindia Telugu

కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. 48 స్థానాలకు గాను టిడిపి 32 స్థానాల్లో విజయదుంధుబి మోగించింది. వైసిపి 10, బిజెపి 3, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు.కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార టిడిపి సత్తా చాటింది. కాకినాడ నగరపాలక సంస్థను టిడిపి కైవసం చేసుకొని చారిత్రక విజయం సాధించింది. 30 ఏళ్ల సుదర్ఘీకాలం తర్వాత కాకినాడ మేయర్‌ పీఠాన్ని సొంతం చేసుకుంది.
కాకినాడ నగర మేయర్‌ బరిలో శేషకుమారి, అడ్డూరి లక్ష్మి (వరలక్ష్మి), సుంకర పావని, సుంకర శివప్రసన్న ఉన్నట్టుగా తెలుస్తోంది. మేయర్‌ ఎంపికపై టిడిపి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అధిష్టానం ఎవరి పేరు ప్రకటించినా మద్దతిస్తామని కార్పోరేటర్లు అంటున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా