By: Oneindia Telugu Video Team
Published : May 29, 2017, 11:55

తుస్....దిశా నిర్దేశంలేని 'మహానాడు'

Subscribe to Oneindia Telugu

మహానాడు. ఈ పేరు వింటే చాలు టీడీపీ కార్యకర్తలకు, నేతలకు ఒక జోష్‌ ఉండేది. మహనాడు ఎప్పుడెప్పుడా అని ఏడాది పొడవునా ఎదురుచూస్తూ ఉండేవారు. మహానాడు దగ్గర పడుతుంటే అందుకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలుగు తమ్ముళ్లు నిమగ్నమైపోయేవారు. గండిపేట మొత్తం పసుపుమయంగా మారిపోయేది. పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..? పార్టీ పదవుల్లో ఎలాంటి మార్పులు చేస్తారు..? అనే ఆశక్తి ఉండేది. చంద్రబాబు కూడా తమ్ముళ్లకు ఒక దిశా నిర్దేశం చేసేవారు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే వారు. పార్టీ ఇక నుంచి ఎలా నడవాలో... ఎలా నడిపించాలో బోధించేవారు. ఇదంతా ఒకప్పటి శోభ. కానీ ఇప్పుడు ఆ కాంతులు కనిపించలేదు. ఆ జోష్‌ జాడ లేదు. మహనాడు జరిగిందా అంటే జరిగింది అన్నట్టుగానే జరిగిపోయింది. తెలంగాణలో మహనాడు జరిగిన తీరుపై ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో చర్చ మొదలైంది. పార్టీ మనుగడకు ప్రమాదం ఏర్పడిన తరుణంలో... ఎందుకు మహానాడు ఇలా జరిగింది అని ప్రజలు సైతం చర్చించుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా