By : Oneindia Telugu Video Team
Published : June 23, 2017, 11:36

జగన్ నాయకుడిని చెప్పుతో కోడతానన్న tdp mla

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ సాయి రెడ్డిపై ఎమ్మెల్యే బండారు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ భూస్కాంపై తనపై వైసిపి నేతలు ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు.తన తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా తాము నైతిక విలువలతోనే బతుకుతున్నామన్నారు. భూదాన్ ఉద్యమంలో 10 ఎకరాల భూమిని దానం చేసిన చరిత్ర తమది అన్నారు. 16 నెలలు జైలు జీవితం గడిపిన ఆర్థిక నేరస్తుడైన విజయసాయి విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. తాను భూకబ్జాలు చేశానన్న విమర్శలకు విజయసాయిరెడ్డి ఆధారాలు చూపించాలని, అడ్డగోలుగా విమర్శలు చేస్తే, సహించేది లేదన్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా