By: Oneindia Telugu Video Team
Published : January 02, 2017, 05:39

డీజీపీని కలిసిన సోమిరెడ్డి, కాకానిపై ఫిర్యాదు

Subscribe to Oneindia Telugu

తెదేపా ఎమ్మెల్సీ సోమిరెడ్డి శుక్రవారం ఉదయం డీజీపీ సాంబశివరావును కలిశారు. వైకాపా నేత కాకాని గోవర్థన్‌ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన ఆస్తులపై నకిలీ దస్తావేజులు సృష్టించి ఆరోపణలు చేస్తున్నారని.. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకాని నకిలీ దస్తావేజులతో ఆరోపణలు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను తప్పు చేస్తే శిక్షకు సిద్ధమేనని స్పష్టం చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా