By: Oneindia Telugu Video Team
Published : April 25, 2017, 11:17

m.p కొడుకు వీరంగం బాబు సీరియస్

Subscribe to Oneindia Telugu

హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు అంబరీష్ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని బాగేపల్లి టోల్‌గేట్ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి అంబరీష్ దాడి చేసిన విషయం తెలిసిందే. టోల్ రూమ్ అద్దాలను పగులగొట్టి, కంపూటర్లను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాడు. అంతేకాకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.
ఈ ఘటనపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన సీఎం చంద్రబాబు.. సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని పోలీసుశాఖను ఆదేశించారు. ఎంతటివారైనా వదిలిపెట్టేదిలేదని సీఎం స్పష్టం చేశారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా