By : Oneindia Telugu Video Team
Published : March 28, 2018, 02:55

దేశానికి మంచిది కాదు : సోనియాను చూపి హెచ్చరిక


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిపై టీడీపీ నేతలు బుధవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబును, పార్టీ నేతలను ఆయన విమర్శించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు.
పలు కేసుల్లో ముద్దాయిగా ఉండి, జైలుకు వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దేశ రాజకీయాలు నడపడం దురదృష్టకరమని టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో బీజేపీ నాటకం ఆడిస్తోందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆర్థిక నేరస్తుడైన విజయసాయి రెడ్డి విమర్శించడం సిగ్గుచేటు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వేరుగా అన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా విజయసాయి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
చంద్రబాబు ప్రజానేత అని బుద్ధా వెంకన్న అన్నారు. విజయసాయి ధనబలం ఉన్న నీచ రాజకీయ నాయకుడన్నారు. ఆయన చేసిన నీచమైన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజానీకం వ్యతిరేకిస్తోందన్నారు. ప్రధాని కాళ్లపై పడ్డ విజయసాయికి చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి కొన్ని పార్టీలు రాకపోవడం దారుణం అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా