• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 04, 2018, 02:45
    Duration : 03:29

    అవినాశ్ రెడ్డి మైక్ లాక్కున్న టీడీపీ !

    తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కంటే ముందే పులివెందులకు నీరు ఇచ్చి మాట నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. కొందరు కోర్టుకు ఎక్కినా, కాంట్రాక్టర్లు మొండికేసినా వెనక్కి చూడకుండా గట్టిగా సంకల్పించి సాధించుకున్నామన్నారు. తనది ఉడుం పట్టు అన్నారు. కడప జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు బుధవారం పులివెందుల, లింగాల మండలాల్లో పర్యటించారు. లింగాల మండలం పార్నపల్లెలో పైలాన్ ఆవిష్కరించి గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పులివెందులలో కూడా మాట్లాడారు.
    తాను రాయలసీమకు నీళ్లు తెస్తుంటే కొందరు ఎగతాళి చేశారని, ఇప్పుడు ఈ నీళ్లను చూసి వారు ఏం సమాధానం చెబుతారని వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. కొందరు అబద్ధాలు ఆడుతూ రాజకీయం చేయడం దారుణమన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన తాను రైతులకు మంచి చేయాలని ప్రయత్నిస్తున్నానని, రాయితీలు ఇస్తున్నానని చెప్పారు. ఒకప్పుడు రాయలసీమలో ముఠాకక్షలు ఉండేవని, వాటి నిర్మూలనకు తీవ్రస్థాయిలో ప్రయత్నించామని చంద్రబాబు అన్నారు. మొత్తం 19 లక్షల ఇళ్లు కడుతున్నామని, సంక్రాంతి తర్వాత 2.50 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తామని చెప్పారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా