By: Oneindia Telugu Video Team
Published : December 19, 2017, 03:57

గుజరాత్ ఎఫెక్ట్ : AP కి మంచి కాలమేనా, కలిసొచ్చేనా?

Subscribe to Oneindia Telugu

గుజరాత్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం పట్ల టిడిపి హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గిపోవడంతో ఆత్మ పరిశీలన చేసుకొనేందుకు బిజెపికి అవకాశం దక్కుతోందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఆరో దఫా విజయం సాధించింది. అయితే ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపాయి. బిజెపికి కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీనే ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీకి చెందిన టిడిపి నేతలు అంతర్గత సంభాషణల్లో పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఓడిపోతే ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవని టిడిపి నేతలు అభిప్రాయంతో ఉన్నారు.ఈ ఫలితాలు వ్యతిరేకంగా వస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తదుపరి పాలనాకాలం సాఫీగా జరిగేది కాదని, ఇప్పుడు మరో ఏడాదిన్నరపాటు సుస్థిరంగా తన పని తాను చేసుకోవడానికి అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. ‘ప్రధాని సొంత రాష్ట్రంలోనే ఓటమి ఎదురైతే పరిస్థితి ఇబ్బందికరంగా మారేదంటున్నారు టిడిపి నేతలు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా