By : Oneindia Telugu Video Team
Published : August 03, 2017, 11:19

టీమిండియా హోం సీజన్‌ తెలుగు రాష్ట్రాల్లోనే.. ఎక్కడెక్కడో తెలుసా..?

స్వదేశంలో కొత్త సీజన్‌లో టీమిండియా పుల్ బిజీగా ఉండబోతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు స్వదేశంలో టీమిండియా విరామం లేకుండా క్రికెట్‌ హోరెత్తించనుంది. నాలుగు నెలల కాలంలో కోహ్లీసేన ఏకంగా 23 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది.
హోం సీజన్‌లో టీమిండియా మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనున్న టీమిండియా ఆ తర్వాత శ్రీలంకతో మూడేసి టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్‌ను ఆడనుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను మంగళవారం బీసీసీఐ టూర్స్‌ అండ్‌ ఫిక్చర్స్‌ కమిటీ ప్రకటించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా