By : Oneindia Telugu Video Team
Published : September 25, 2017, 12:42

కోహ్లీసేన సిరిస్‌ను వైట్‌వాష్ చేస్తుంది

ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాను ఓడించడం ఆస్ట్రేలియా వల్ల కాదని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్‌ను కోహ్లీసేన 5-0తో సిరిస్‌ను కైవసం చేసుకుంటుందని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. అంతేకాదు ఆసీస్ దిగ్గజ కెప్టెన్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్‌లు వచ్చి కెప్టెన్సీ చేసినా ప్రస్తుత భారత జట్టును ఓడించడం వారి వల్ల సాధ్యం కాదని సెహ్వాగ్ అన్నాడు. 'ప్రస్తుత టీమిండియా జట్టు చాలా బలంగా ఉంది. అదే సమయంలో ఆసీస్ క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. వన్డే సిరీస్ భారత్ వైట్ వాష్ చేయడం ఖాయం' అని సెహ్వాగ్ అన్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా