By: Oneindia Telugu Video Team
Published : December 31, 2017, 04:58

కెసిఆర్ పవర్ ఫుల్ పంచెస్

Subscribe to Oneindia Telugu


కెసిఆర్ పవర్ ఫుల్ పంచెస్
కెసిఆర్ రాజకీయ చతురత, వాక్చాతుర్యం గురించి అందరికీ తెలుసు. ఇక అసెంబ్లీ లో ఆయన ప్రతిపక్షాలను ఎలా ఆడుకున్నారో మీరే చూడండి. అసెంబ్లీ లో పలు విషయాలపై ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి ఇస్తుంటే విమర్శించడం తగదని కేసీఆర్ అన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులకు ఆయన సూచించారు. సిమెంటు ధరల పెంపు పై వస్తున్న విమర్శలను కెసిఆర్ తిప్పి కొట్టారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరిగారు.
సిమెంట్ ధరల పెంపుపై కెసిఆర్ శాసన సభను తప్పుదోవ పట్టించాలని చూశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిమెంటు ధరలను పెంచి, కృత్రిమ కొరత సృష్టిస్తే ఆ కంపెనీలపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గతంలో సిమెంట్ కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తే కాంపిటీషన్ కమిషన్ విచారణ చేపట్టి 11 సిమెంట్ కంపెనీలపై రూ.6,500 కోట్ల జరిమానా విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనితో పాటు కెసిఆర్ పవర్ ఫుల్ పంచెస్ మీకోసం !

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా