By: Oneindia Telugu Video Team
Published : December 15, 2017, 12:05

ఆదిభట్లలో విమాన ఇంజిన్ల తయారీ

Subscribe to Oneindia Telugu


తెలంగాణకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కింది. వైమానిక రంగంలో ప్రసిద్ధ సంస్థలైన జీఈ ఏవియేషన్‌, టాటా అడ్వాన్స్‌ సిస్టం లిమిటెడ్‌తో కలిసి హైదరాబాద్‌ శివారు ఆదిభట్లలో వైమానిక ఇంజిన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు గురువారం ముంబైలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై జీఈ సంస్థ ఛైర్మన్‌ జాన్‌ ఎల్‌ ఫ్లానరీ, టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌లు సంతకాలు చేశారు. అమెరికాకు చెందిన జీఈ ఏవియేషన్‌ సంస్థ వాణిజ్య, సైనిక, వ్యాపార, పౌర విమానాలు, జెట్‌ విమానాల ఇంజిన్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.
కాగా, దేశంలోనే తొలిసారిగా అత్యున్నత నాణ్యత గల సీఎఫ్‌ఎం లీప్‌ ఇంజిన్లు, వాటి విభాగాల తయారీ, అసెంబ్లింగ్‌, టెస్టింగ్‌ పరిశ్రమతో పాటు ప్రతిభా కేంద్రం (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కృషి ఫలితంగా ఈ పరిశ్రమ రాష్ట్రానికి దక్కింది. కేటీఆర్‌ గత సంవత్సర కాలంగా వైమానిక పరిశ్రమను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని జీఈ సంస్థను కోరుతున్నారు. నిరుడు అమెరికా పర్యటన సందర్భంగా ఆ సంస్థ ఛైర్మన్‌ జాన్‌ ఎల్‌.ఫ్లానరీతో భేటీ అయి ఈ మేరకు విన్నవించారు. బుధవారం ఢిల్లీలోనూ ఆయన మరోసారి ఫ్లానరీని కలిసి ఈ అంశాన్ని ప్రస్తావించారు. కేటీఆర్‌ వినతిని పరిగణనలోకి తీసుకుని పరిశ్రమ స్థాపనకు హైదరాబాద్‌ను ఎంపిక చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా