By : Oneindia Telugu Video Team
Published : January 05, 2017, 12:17

అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్.. గవర్నర్

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని..గవర్నర్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, సీనియర్‌ అధికారులు గవర్నర్‌ నరసింహన్‌ ను రాజ్‌ భవన్‌ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఎవరి సలహాలనైనా కేసీఆర్‌ తీసుకుంటారన్నారు. ఇలాంటి సీఎంను నిజంగా నేనెప్పుడూ చూడలేదని కితాబిచ్చారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌వనగా నిలుస్తుందని, 2017లో తెలంగాణ మరిన్ని విజయాలను సాధిస్తుందని అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా