By : Oneindia Telugu Video Team
Published : January 04, 2018, 10:42

ఈ రాశుల వారికి గర్వం ఎక్కువ.. చచ్చేలోపు పగ సాధిస్తారు !


ప్రతి రాశి వారు ఏదో ఒక ప్రత్యేక గుణంతో ఉంటారు. కొన్ని రాశుల వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రాశుల వారు శాంతంగా ఉంటారు. మరికొన్ని రాశుల వారికి గర్వం ఎక్కువగా ఉంటుంది. మరి ఏ రాశి వారికి ఎలాంటి గుణం ఉంటుందోగానీ ఈ నాలుగు రాశుల వారికి మాత్రం గర్వం ఎక్కువగా ఉంటుంది.
అయితే ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏమి లేదు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేరు. అలాగే తమను తాము చాలా ఎక్కువగా భావించుకుంటారు. మరి ఆ రాశులు ఏమిటో మీరూ తెలుసుకోండి.
సింహరాశి.. ఈ రాశి వారు కాస్త గర్వంగా ఉంటారు. వీరిలో కాస్త అహం ఉంటుంది. మాకు మించిన వాళ్లు ఎవరూ ఉండరని వీరి భావన. ఈ రాశిలో ప్రథమస్థానంలో సూర్యుడు ఉంటాడు. అందువల్ల వీరు ఎక్కువగా గర్వంతో ఉంటారు. అయితే వీరి వల్ల కొన్నిసార్లు పక్కన వారు కూడా ఇబ్బందులుపడతారు. వారి గర్వంతో అందర్ని తక్కువగా అంచనా వేస్తారు. వీరిని ఎవరైనా విమర్శలు చేస్తే సహించలేరు.
సింహం మాదిరిగానే వీరికి కూడా అహంకారం ఎక్కువ. వీళ్లు చాలా తక్కువ సమయంలోనే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. బాగా ఎదుగుతారు. అయితే వీరికుండే గర్వం వల్ల వీరు త్వరగా పతనం అవుతారు. వీరు కాస్త అహంకారం తగ్గించుకుంటే చాలు. జీవితంలో ఉన్నతస్థానానికి వెళ్తారు.
వృశ్చిక రాశి..ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరిని ఎవరైనా మోసం చేస్తే అస్సలు తట్టుకోలేరు. అవమానంగా భావిస్తారు. వీరికి గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వీరిని ఒక్కమాట అన్న కూడా తట్టుకోలేరు. వీరిని సరదగా కూడా ఒక్కమాట అన్నామంటే అంతే.
మనస్సులో ఉంచుకుంటారు వీరిని ఏమన్నా అన్నామంటే అదే విషయాన్ని మనస్సులో ఉంచుకుని తర్వాత అవతలి వ్యక్తులపై పగ తీర్చుకుంటారు. వీరికి కాస్త అహంకారం ఉంటుంది. వీరిని ఎవరైనా ఏమన్నా అంటే సహించలేరు.
కర్కాటకం.. వీరికి గర్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వీరి వ్యక్తిత్వమే అంతే. తమను తాము చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటారు. ఎవడైతే నాకేంటి అనే టైప్ ఉంటారు. వీరు సామాన్యంగా ఎవరి జోలికెళ్లరు.
వీరిని ఎవరైనా కెలికితే వాళ్ళ పని అంతే. వీరిని ఇబ్బంది పెట్టేవారిని అస్సలు మరిచిపోరు. కచ్చితంగా వారిపై పగ తీర్చుకుంటారు. ఒక్కసారి వీరిని ఏమన్నా తప్పుగా మాట్లాడితే ఆ విషయాన్ని చచ్చేంత వరకు గుర్తు పెట్టుకుంటారు. వీరు చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు. అనవసరంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాత్రం సహించరు.
మేషం ఈ రాశి వారికి కూడా గర్వం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఏ పనైనా చేయగలను.. ఎవరినైనా ఎదురించగలను అనే నమ్మకం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. వీరిని అనవసరంగా రెచ్చగొడితే మాత్రం చాలా ప్రమాదకరం.
వీరిని ఎట్టి పరిస్థితుల్లో కించపరచకుండా ఉండడం మేలు. వ్యక్తిత్వం మంచిదే అయితే ఉన్నట్టుండి మాకు మించిన మొనగాడు లేడని వీళ్లు ఫీలవుతుంటారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా