By : Oneindia Telugu Video Team
Published : November 06, 2019, 03:00
Duration : 02:31
02:31
మూడు జీవోలతో ముప్పేట దాడి.. జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి..!
మూడు జీవోలు..మూడే మూడు జీవోలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ముప్పేట దాడికి తెర తీశాయి. ప్రభుత్వంపై ఘాటు విమర్శలను సంధించడానికి కారణాలయ్యాయి. ప్రతి అంశానికీ వివరణ ఇచ్చుకునేలా చేశాయి. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడేలా చేశాయి. మీడియాపై ఆంక్షలను విధిస్తూ జారీ చేసిన జీవో ప్రకంపనలను రేపింది. మీడియాను నియంత్రించేలా ఈ జీవోను ప్రభుత్వం జారీ చేసిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నియంతృత్వ ధోరణికి దారి తీసిందంటూ ఆరోపణలు ప్రభుత్వ పెద్దలను చుట్టుముట్టాయి.